Thursday, October 31, 2013

తెలుగులో ముచ్చటగా మూడోసారి - వెంకటేష్, నయనతార...


             హిట్ ఫెయిర్ అని మనం వింటునే ఉంటాం. తెలుగులో ప్రస్తుతం వెంకటేష్, నయనతార లను హిట్ ఫెయిర్ గా పిలుస్తారు. ఎందుకంటే ఇది వరకు వీరిద్దరూ నటించిన 'తులసీ, లక్ష్మీ' సినిమాలు పెద్ద విజయాన్ని అందుకున్నాయి. ఆతర్వాత చాలా సినిమాల్లో వీరిద్దరిని తెరపైకి తీసుకురావడానికి చాలా వరకు ప్రయత్నాలు జరిగాయి. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకీ పక్కన నయనతారను నటింపచేయాలని చూసిన వీలు కుదరలేదు. అయితే ప్రస్తుతం దానయ్య నిర్మాణంలో  మారుతి దర్శకుడిగా వెంకటేష్ నటిస్తున్న సినిమా 'రాధ'. సినిమాలో వెంకటేష్ పక్కన నయనతార నటించనుందట. సంప్రదింపులు కూడా జరిగాయట. ఇప్పుడు నయన ఒకే అనడం ఒకటే తరువాయి. అంటే మరోసారి జోడి మనకు కనువింద చేయనుందన్నమాట.
***

1 comment:

reguvardan said...

news4andhra is a Entertainment portal provides you information about Tollywood News, Telugu Politics News, Celebrity news, cinema news, box office collections and more at one place Get Latest Telugu Movie Reviews
Telugu Movies Video Songs